కింగ్ నాగార్జున స్క్రీన్ మీద ఎలాంటి పాత్రలతో అయినా మెప్పించగలరని తెలిసిందే. రొమాంటిక్ హీరోగా ఇమేజ్ ఉన్న ఆయన్ను అందరు టాలీవుడ్ మన్మథుడు అని అంటారు. తను ఎలాంటి పాత్రలో అయినా చేయగలనని ప్రూవ్ చేశారు. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలు చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు ఆధ్యాత్మిక సినిమాలు అందిస్తూ తన సత్తా చాటారు నాగార్జున.
ఐతే ఆయన లీడ్ రోల్ సినిమాలే కాదు సినిమాలు ఇంపార్టెంట్ అనుకుంటే చిన్న చిన్న పాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణార్జున, ఊపిరి సినిమాల్లో తన పాత్రల గురించి తెలిసిందే. ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు నాగార్జున. సూపర్ స్టార్ రజినికాంత్ (Rajinikanth) లీడ్ రోల్ లో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ (Coolie) సినిమా వస్తుంది. ఈ సినిమాలో రజినితో పాటు డాన్ పాత్రలో నాగార్జున కూడా నటిస్తున్నారు.
సిమన్ పాత్రలో డాన్ గా నాగార్జున
కూలీ సినిమాలో సిమన్ పాత్రలో డాన్ గా అదరగొట్టబోతున్నారు నాగార్జున. ఈ సినిమా విషయంలో కొత్త అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సినిమాలో ఏదో నాగార్జునకి స్పెషల్ రోల్ ఇచ్చారని అనుకున్నారు కానీ ఇది క్యామియో రోల్ కాదు సినిమాలో రజినీకి ధీటుగా ఈ రోల్ ఉండేలా ఉంది. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) కూడా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెబుతున్నాడు.
సో మన కింగ్ Nagarjuna ఈసారి కోలీవువుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించేలా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.