King Nagarjuna : నాగార్జున మళ్లీ అతనితోనే..?

King Nagarjuna కింగ్ నాగార్జున ఈ ఇయర్ సంక్రాంతికి నా సామిరంగ తో సూపర్ హిట్ అందుకున్నాడు. జస్ట్ 3 నెలల్లో సినిమా తీసి హిట్ కొట్టిన నాగార్జున ఇక మీదట ప్రతి సంక్రాంతికి

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 06:59 PM IST

King Nagarjuna కింగ్ నాగార్జున ఈ ఇయర్ సంక్రాంతికి నా సామిరంగ తో సూపర్ హిట్ అందుకున్నాడు. జస్ట్ 3 నెలల్లో సినిమా తీసి హిట్ కొట్టిన నాగార్జున ఇక మీదట ప్రతి సంక్రాంతికి తన సినిమా రిలీజ్ అవుతుందని అభిమానులకు చెప్పాడు. నా సామిరంగ తర్వాత ధనుష్ హీరోగా చేస్తున్న కుబేర సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు నాగార్జున.

ఈ సినిమాతో పాటుగా మరో మల్టీస్టారర్ కూడా ప్లానింగ్ లో ఉందని టాక్. ఇదిలాఉంటే నా సామిరంగ హిట్ అందించిన డైరెక్టర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో మరో సినిమాకు నాగార్జున ఓకే చెప్పినట్టు టాక్.

అసలైతే విజయ్ బిన్ని నాగార్జునతో సొంత కథ చేయాలని అనుకున్నాడు. కానీ నాగార్జున మలయాళ సినిమా ఇచ్చి రీమేక్ చేయమనడంతో అదే నా సామిరంగ సినిమాగా చేశాడు. ఐతే నా సామిరంగ హిట్ అవ్వడంతో విజయ్ బిన్ని సొంత కథతో నాగార్జున సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ కూడా ఎంటర్టైనింగ్ మోడ్ లో డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

నాగార్జున మార్క్ మాస్ అంశాలతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. నా సామిరంగ సినిమా టీజర్ నుంచి సినిమాపై బజ్ పెంచాడు విజయ్ బిన్ని. ఇక సినిమాతో కూడా సక్సెస్ అందుకోవడంతో విజయ్ బిన్నితో మరో సినిమాకు రెడీ అయ్యాడు. విజయ్ తో నాగార్జున కాంబో ఈసారి ఎలాంటి మూవీతో వస్తారో చూడాలి. ఈ సూపర్ హిట్ కాంబో మీద అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Also Read : Karthikeya Baje Vayu Vegam : కార్తికేయ కరెక్ట్ రూట్ లోకి వచ్చాడా..?