ఇటీవలి కాలంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకోవడం సాధారణమైన విషయంగా మారిపోయింది. కెరీర్ ఒత్తిడులు, వ్యక్తిగత అభిరుచులు, చిన్న చిన్న విభేదాలు కూడా పెద్ద సమస్యలుగా మారి కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సినీ జంటలు సైతం ఎక్కువగా విడాకులు తీసుకుంటూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రముఖ జంట విడాకుల (Divorce ) కారణంగా వార్తల్లో నిలిచింది.
Atal Bihari Vajpayee’s Death Anniversary : వాజ్‌పేయి జీవితం, సాధించిన విజయాలు
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా ఐకాన్, బిజినెస్ వుమన్ కిమ్ కర్దాషియన్ తన భర్త, ప్రముఖ ర్యాప్ గాయకుడు కెన్యే వెస్ట్(Kim Kardashian and Kanye West Divorce)తో విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని బహిరంగంగా వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి విషయాలు వ్యక్తిగతంగానే ఉంచుతారు కానీ, కిమ్ ఓ మీడియా సమావేశంలో తన భర్త గురక పెట్టే అలవాటు కారణంగానే దాంపత్య జీవితం దెబ్బతిన్నదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఎక్కడ కూర్చున్నా నిద్రపోవడం, అప్పుడు వచ్చే గురక శబ్దం భరించలేని స్థాయికి చేరేది. నేను రొమాంటిక్‌గా ఉన్నా అతను నిద్రలో మునిగిపోయేవాడు” అని ఆమె స్పష్టంగా చెప్పింది.
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈ విషయాలు వెలుగులోకి రాగానే నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇంత చిన్న కారణం కూడా ఒక పెద్ద సమస్యగా మారి విడాకుల వరకు తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో అన్యోన్య దంపతులుగా కనిపించిన ఈ జంట, కేవలం నిద్ర అలవాటు, గురక వంటి కారణాల వల్ల విడిపోవడం నిజంగా విచిత్రమని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో చిన్న విషయాలే పెద్ద విభేదాలకు దారి తీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.