Kiccha Sudeep : గత ఏడాది కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మ్యాక్స్’ మూవీ త్వరలో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 15న రాత్రి 7:30 గంటలకు ZEE5 ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.
నూతన దర్శకుడు విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో విశేష ఆదరణ పొందింది. కిచ్చా సుదీప్ మాస్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఘన విజయాన్ని సాధించింది.
కిచ్చా సుదీప్‌తో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ కీలక పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై కిచ్చా సుదీప్ నిర్మించారు. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా ‘మ్యాక్స్’ గుర్తింపు పొందింది.
Thummala Nageswara Rao : రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలపై ఎందుకిలా మౌనం? బ్యాంకర్లపై మంత్రి తుమ్మల ఫైర్
పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో సుదీప్ అదరగొట్టారు. గ్యాంగ్‌స్టర్‌లను ఎదుర్కొనే నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటన హైలైట్‌గా నిలిచింది. ఒక్క రాత్రిలో జరిగే థ్రిల్లింగ్ సంఘటనలను గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ZEE5లో డిజిటల్ ప్రీమియర్‌పై కిచ్చా సుదీప్ మాట్లాడుతూ, “మ్యాక్స్ మూవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరనుంది. థియేటర్లలో వచ్చిన క్షణం నుంచి ఆడియన్స్ ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించడం గర్వంగా ఉంది. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో నిండిన ఈ సినిమా ZEE5లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం,” అని తెలిపారు. మొత్తం మీద, సుదీప్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని భాషల ఆడియన్స్ కోసం రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఫిబ్రవరి 15 నుంచి జీ5లో చూడవచ్చు.
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్