Site icon HashtagU Telugu

Independence Day 2023: సరిహద్దుల్లో జవాన్లతో కియారా

Independence Day 2023

New Web Story Copy 2023 08 08t202756.943

Independence Day 2023: ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇదే సమయంలో నటి కియారా అద్వానీ సరిహద్దు ప్రాంతంలో జవాన్లని కలిశారు. వారితో సరదాగా ముచ్చటించారు. ఫోటోలు కూడా దిగారు. అయితే ఆమె ఓ సినిమా షూటింగ్ లో భాగంగా జవాన్లని కలవడం జరిగింది. కియారా నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతుంది. అమృత్‌సర్‌ అట్టారీ సరిహద్దుకు చేరుకున్న ఆమెఅక్కడి జవాన్లను కలిశారు. త్రివర్ణ పతాకాన్ని తిప్పుతూ దేశభక్తి చాటుకున్నారు. కాగా.. ఈ ఏడాది లక్ష మొక్కలు నాటాలని బీఎస్‌ఎఫ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారంలో కియారా అద్వానీ కూడా భాగమైంది. బోర్డర్‌లో కియారా పేరు మీద బీఎస్‌ఎఫ్ జవాన్లు ఓ చెట్టును కూడా నాటారు.

Also Read: Chiranjeevi Vs YCP : వైసీపీ నేతలు మళ్లీ..మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?