Kiara Advani In Love: హీరో సిద్దార్థతో పెళ్లి పీటలెక్కుతున్న కియారా… “కాఫీ విత్ కరణ్” షోలో క్లారిటీ!!

"కాఫీ విత్ కరణ్" షోలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 02:56 PM IST

“కాఫీ విత్ కరణ్” షోలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది.

ఈ షో సందర్భంగా కరణ్ … రాబోయే ఎపిసోడ్ నుంచి కియారా క్లిప్‌ను ప్లే చేశాడు. అందులో ఆమె.. సిద్ధార్థ్ “క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ” అని ఒప్పుకుంది. తర్వాత, కరణ్ ఆమెను ప్రస్తుత జీవితం సినిమా టైటిల్‌గా ఉంటుందా ? అని అడిగినప్పుడు.. “షేర్షా” అని జోడించే ముందు, “ఇది కింగ్ సైజ్ లాగా ఉండాలి” అని కియారా బదులిచ్చింది. కియారా చెప్పిన సమాధానం చూసిన సిద్ధార్థ.. ఆమెను ఎందుకంతా ఇబ్బంది పెట్టావంటూ కరణ్‌ను ప్రశ్నించాడు. ప్రతీ ఒకరు సంతోషంగా ఉండాలి. ఆనందమైన జీవితాన్ని గడపాలి అన్నాడు. మీ ఆశీర్వాదాలు మాకు ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు సిద్ధార్థ.

పెళ్లికి పిలవకపోతే చెంపదెబ్బ కొడతానని కరణ్ సిద్ధార్థ్‌ను హెచ్చరించాడు. “ప్రజల పెళ్లి గురించి నాకు చాలా పెద్ద ఫోమో ఉంది” అని కరణ్ చమత్కరించాడు. దానికి సిద్ధార్థ్ బదులిస్తూ.. “చింతించకండి, మీరు నా పెళ్లిని మిస్ చేయరు” అని అన్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీళ్ళు డేటింగ్ కూడా చేస్తున్నారు. ఇద్దరు కలిసి హోటల్స్,పార్టీలకు తిరిగారు.

షేర్షా’ సినిమాలో వీరిద్దరూ కలిసి తొలిసారి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఏ పార్టీకి వెళ్లినా జంటగా కనిపిస్తున్నారు.

డేటింగ్ చేసిన తర్వాత..

కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా హిట్ కొట్టిన చిత్రం షేర్షాలో . ఈ సినిమాలో కలిసి నటించినప్పటి నుండి వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్ల వచ్చాయి. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ విడిపోయారంటూ కొన్ని నెలల క్రితం కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ తరుణంలో
ముంబైలో కియారా చిత్రం భూల్ భూలయ్యా 2 స్క్రీనింగ్‌కు హాజరయ్యాడు సిద్ధార్థ. స్క్రీనింగ్ వేదిక వద్ద వారు ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. సిద్.. కియారాను కౌగిలించుకోవడంతో… బ్రేకప్ వార్తలకు పుల్ స్టాప్ పడినట్లైంది.

‘భరత్ అనే నేను’ సినిమాతో..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఎందరో హీరోలతో కలిసి నటించింది. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అటు హిందీలో ఫుల్ బిజీగా మారింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.