Site icon HashtagU Telugu

Kiara Advani: తల్లి కాబోతున్న కియారా.. ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న స్టార్ హీరోయిన్?

Kiara Advani

Kiara Advani

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి మనందరికి తెలిసిందే. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇకపోతే కియారా అద్వానీ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ దంపతులు శుభవార్తను తెలిపారు. కియారా త్వరలోనే తల్లి కాబోతోంది అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే కియారా అద్వానీ గర్భంతో ఉందని తెలియగానే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, కియారా అద్వానీ, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

అయితే కియారా టేకప్ చేసిన సినిమాలకు సంబంధించి మరో వార్త వస్తోంది. కియారా అద్వానీ గర్భం ధరించిందని తెలియగానే డాన్ 3 సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని తెలుస్తోంది. కియారా అద్వానీకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. హిందీతో పాటు దక్షిణాదిలో కూడా ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే కియారా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యష్ రాబోయే చిత్రం టాక్సిక్ సినిమాలో కూడా కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న వార్ 2 చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే డాన్ 3 సినిమా నుంచి కియారా అనూహ్యంగా తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. డాన్ 3 చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరో గా నటిస్తున్నాడు. అతని సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని ఇది వరకే ప్రకటన కూడా వెలువడింది. అయితే గర్భవతి అయిన తర్వాత షూటింగ్‌ లో పాల్గొనడం కష్టంగా ఉండటం వల్ల డాన్ 3 నుంచి కియారా అద్వానీ తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందని సమాచారం.