Site icon HashtagU Telugu

Kiara Advani : తల్లి కాబోతున్న గేమ్ ఛేంజర్ బ్యూటీ

Kiara Advani Set To Debut B

Kiara Advani Set To Debut B

టాలీవుడ్‌లో ‘భరత్ అనే నేను’ సినిమాతో అరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తన తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాల్లో రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. రీసెంట్‌గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో మరోసారి రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశ పరిచినప్పటికీ, కియారాకు మాత్రం ప్రేక్షకులు మంచి స్పందననే అందించారు.

Congress : ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడతారా? అంత దమ్ముందా..? – మంత్రి పొంగులేటి

ఇదిలా ఉండగా తాజాగా కియారా అద్వానీ తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. ఇటీవల భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన ఆమె, బేబీ బంప్‌తో కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “వావ్ బేబీ బంప్ నైస్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే కియారా తాను గర్భవతినని హింట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ వీడియో మరింతగా దృష్టిని ఆకర్షిస్తోంది. బేబీ బంప్‌తో చిరునవ్వుతో కెమెరాకు చిక్కిన కియారాను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య ప్రేమకథ ‘షేర్షా’ సినిమా సమయంలో ప్రారంభమై, ప్రేమ పెళ్లిగా మారింది. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్ సూర్య గఢ్ హోటల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగింది. అప్పటి నుంచి బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో ఉంది. వారి జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్న వార్తపై అభిమానులూ, సెలెబ్రిటీలూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.