Kiara Advani – Janhvi Kapoor : ఆ హీరోకి జంటగా కియారా అద్వానీ, జాన్వీ కపూర్..

నార్త్ బ్యూటీస్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్.. సౌత్ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా..

Published By: HashtagU Telugu Desk
Kiara Advani Janhvi Kapoor Will Be Pair With Silambarasan Tr In Str48

Kiara Advani Janhvi Kapoor Will Be Pair With Silambarasan Tr In Str48

Kiara Advani – Janhvi Kapoor : నార్త్ బ్యూటీస్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్.. సౌత్ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాల హవా నడుస్తుండడంతో.. బాలీవుడ్ బ్యూటీస్ ఇక్కడ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నార్త్ మార్కెట్ కోసం సౌత్ మేకర్స్ కూడా బాలీవుడ్ భామలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘RC16’ సినిమాల్లో హీరోయిన్ గా జాన్వీని ఎంపిక చేసుకున్నారు. అలాగే ‘గేమ్ ఛేంజర్’లో కియారా నటిస్తుంది.

ఈ సినిమాలతో పాటు మరో కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కి కూడా ఈ ఇద్దరు భామలు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ హీరో ‘యశ్’ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కియారా హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం. అలాగే సూర్య నటించబోయే ‘కర్ణ’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపించాయి. అయితే వీటిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇక తాజాగా ఈ ఇద్దరు భామలు కలిసి ఒకే హీరోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పారట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా..?

తమిళ హీరో శింబు నటిస్తున్న కొత్త సినిమా STR48లో ఈ ఇద్దరు భామలు కలిసి నటించబోతున్నారట. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతుంది. మరి ఈ ఇద్దరు భామలు.. శింబుతో నిజంగానే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

  Last Updated: 22 May 2024, 11:02 AM IST