Site icon HashtagU Telugu

Kiara Advani : కియరా టాపు లేపే రెమ్యునరేషన్..!

2025 Kiara Advani Come with Three Crzy Projects

2025 Kiara Advani Come with Three Crzy Projects

బాలీవుడ్ భామ కియరా అద్వాని (Kiara Advani) అక్కడ సూపర్ ఫాం కొనసాగిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడి ఖాతాలో మరో క్రేజీ ఆఫర్ వచ్చి చేరింది. ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్ లో క్రేజీ సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్న డాన్ 3 లో అమ్మడు హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో రన్ వీర్ సింగ్ మేల్ లీడ్ గా చేస్తున్నాడు.

ఈ సినిమాలో నటించేందుకు గాను కియరా అద్వాని భారీ రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. డాన్ 3 కోసం కీరా 13 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. నార్త్ తో పాటుగా సౌత్ లో కూడా అమ్మడు సత్తా చాటుతుంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసిన కియరా ప్రస్తుతం గేం చేంజర్ సినిమాలో నటిస్తుంది.

బాలీవుడ్ లో దీపిక పదుకొనె, అలియా భట్, జాన్వి ఇలా భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ లో ఇప్పుడు కియరా అద్వాని కూడా చేరింది. డాన్ 3 తో పాటుగా హృతిక్ రోష, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న వార్ 2 లో కూడా కియరా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం కూడా కియరా బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు టాక్.

Also Read : Gopichand : గోపీచంద్ భీమా.. ఛాన్స్ వాడుకుంటాడా..?