Ram Charan Birthday: RC15 సెట్స్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్ గా చెర్రీ..!

సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) సోమవారం 39వ ఏట అడుగుపెట్టనున్నారు. 27 మార్చి 1985న జన్మించిన రామ్ చరణ్ తన 39వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan

Resizeimagesize (1280 X 720) (1) 11zon

సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) సోమవారం 39వ ఏట అడుగుపెట్టనున్నారు. 27 మార్చి 1985న జన్మించిన రామ్ చరణ్ తన 39వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. పుట్టినరోజుకు ముందు అతని సహనటి కియారా అద్వానీ, దర్శకుడు ఎస్ శంకర్‌తో సహా మొత్తం స్టార్ కాస్ట్ రామ్ చరణ్ ప్రీ-బర్త్‌డేని ఘనంగా నిర్వహించారు. శనివారం ఆర్సీ 15 సెట్స్‌లో రామ్ చరణ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. చిత్ర యూనిట్ రామ్ చరణ్ పై గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఈ వేడుకకు కియారాతో పాటు దర్శకుడు ఎస్. శంకర్, కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు.

ఈ వేడుకలో రామ్ చరణ్ నీలిరంగు చొక్కా, ప్యాంటు, సన్ గ్లాసెస్ ధరించి కనిపించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా వైట్ టాప్, బ్లూ జీన్స్‌లో ఉంది. సమాచారం ప్రకారం.. చరణ్ రాబోయే చిత్రం ప్రస్తుత రాజకీయాలతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించిందని విషయం తెలిసిందే.

మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను నిర్వహించేందుకు ఆయన అభిమానులు రెడీ అవుతున్నారు. అన్ని దేశాల్లో వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆయన అభిమానులు సిద్ధం అవుతున్నారు. రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, వృద్ధులకు దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రాలు చేపట్టబోతున్నారు.

  Last Updated: 26 Mar 2023, 01:08 PM IST