Site icon HashtagU Telugu

Game Changer : గేమ్ ఛేంజర్ కొత్త పోస్టర్.. పాతదే మళ్ళీ కొత్తగా..

Kiara Advani Birth Day Poster Released from Game Changer Movie

Kiara Advani

Game Changer : రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇటీవల దిల్ రాజు(Dil Raju) ఓ ఈవెంట్లో చెప్పారు. ఇక సినిమా మొదలయి మూడేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక పోస్టర్, ఒక సాంగ్ తప్ప గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ విషయంలో మాత్రం అభిమానులు నిరాశ చెందుతున్నారు.

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. నేడు హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) పుట్టిన రోజు కావడంతో కియారాకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్తూ ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ లో ఉన్న ఫోటో ఆల్రెడీ రిలీజయిన జరగండి సాంగ్ నుంచి తీసుకున్నదే.

దీంతో మళ్ళీ ఫ్యాన్స్ మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. పుట్టిన రోజుకు హీరోయిన్ కి ఒక కొత్త పోస్టర్ కూడా రిలిజ్ చేయలేరా. ఆల్రెడీ సాంగ్ లో చుసిన విజువల్స్ నుంచే ఇవ్వాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కియారా ఫ్యాన్స్ మాత్రం పోస్టర్ అదిరింది అని ఈ కొత్త పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది.

 

Also Read : Rashmika Mandanna : తెలుగు ఇండియన్ ఐడల్ లో రష్మిక.. ఎంతందంగా ఉందంటే..!