Kiara Advani : అలాంటి సినిమాలే చేస్తా అంటున్న కియారా.. ఆ రెండు సినిమాలతో టాప్ లేపేస్తుందా..?

Kiara Advani బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ లకు ధీటుగా స్టార్ రేంజ్ కొనసాగిస్తుంది అందాల భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అంటోల్డ్ స్టోరీతో లైం లైట్ లోకి

  • Written By:
  • Publish Date - May 21, 2024 / 02:41 PM IST

Kiara Advani బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ లకు ధీటుగా స్టార్ రేంజ్ కొనసాగిస్తుంది అందాల భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అంటోల్డ్ స్టోరీతో లైం లైట్ లోకి వచ్చిన అమ్మడు ఆ సినిమా తర్వాత వరుస ఛాన్సులు అందుకుంది. తెలుగులో కూడా భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది కియరా. ఇక రీసెంట్ గా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియా తరపున ఉమెన్ ఇన్ సినిమా చర్చలో పాల్గొనేందుకు ఇన్విటేషన్ అందుకుంది కియరా.

కేన్స్ ఫెస్టివల్స్ కు ఆహ్వానం అందడం తనని ఎంతగానో సంతోష పరచిందని అన్నారు కియరా అద్వాని. చిన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ఫిల్మ్ ఫెస్టివల్ చూడటానికి వెళ్లా ఇప్పుడు అదే ఫెస్టివల్ కు ఆహ్వానం అందడంతో చాలా సంతోషంగా ఉంది కియరా. ఇక కెరీర్ లో అన్ని జోనర్ సినిమాలు చేయాలని ఉందని చెప్పిన కియరా రాబోతున్న సినిమాల్లో యాక్షన్ సీన్స్ కూడా చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

కియరా ప్రస్తూం వార్ 2, డాన్ 3 సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాల్లో తాను యాక్షన్ సీన్స్ లో కూడా నటిస్తున్నానని హింట్ ఇచ్చింది కియరా. ఇక కంటెంట్ ఉన్న సినిమాలనే తాను చేస్తానని ప్రాధాన్యత లేని పాత్రలకు అసలు ఓకే చెప్పనని అంటుంది. ప్రస్తుతం కియరా చరణ్ తో గేం చేంజర్ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది అమ్మడు.

సిద్ధార్థ్ తో మ్యారేజ్ తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని అంటుంది అమ్మడు. అటు సిద్ధార్థ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు.

Also Read : Manchu Manoj Mirai : మిరాయ్ మంచు హీరో ఒక మంచి నిర్ణయం..!