‘మహానటి’ తర్వాత సమంత, విజయ్ దేవరకొండ రెండోసారి కలిసి నటించారు. గతంలో ‘మజిలీ’లో కలిసి పనిచేసిన చిత్రనిర్మాత శివ నిర్వాణతో సమంతకు ఇదో రెండో మూవీ కావడం విశేషం. విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు తమ రాబోయే చిత్రం ‘ఖుషి’ ప్రమోషన్ కోసం కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన షూటింగ్ అనుభవాలను నటి సమంతా రూత్ ప్రభుతో కలిసి షేర్ చేసుకున్నారు. ఖుషి షూటింగ్ అనుభవాలు తన జీవితంలో చాలా మధురమైన జ్ఞాపకంగా ఉంటాయని ఆయన అన్నారు.
“ఖుషి సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు బాగా ఎంజాయ్ చేశాను. అందుకే ఈ మూవీ నాకు మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. సమంత, శివతో నేను ఏర్పరచుకున్న బాండింగ్, వారిద్దరితో గడిపిన సమయం నేను మరిచిపోలేను. ఈ సినిమా నిర్మాణం గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ ఆనందిస్తా. ఇక కాశ్మీర్ అందాలు, సమంత కాఫీ డేట్ చాలాకాలం గుర్తుండిపోతాయి. సమంత అనారోగ్యం బారిన పడినప్పటికీ, ఆ ప్రభావం పడకుండా షూటింగ్ చేసింది. ఆమె మంచి కో స్టార్” అని విజయ్ దేవరకొండ అన్నారు.
ఇప్పటికే విడుదలైన ఖుషి ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆరాధ్య, విప్లవ్ ల ప్రేమకథను చూపిస్తుంది. వారి శృంగార ప్రయాణం ఆద్యంత ఆసక్తికరంగా ఉంటుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించంది. ‘ఖుషి’ సెప్టెంబర్ 1 న తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Also Read: KCR’s Niece: కరీంనగర్ బరిలో కేసీఆర్ మేనకోడలు, కాంగ్రెస్ నుంచి రమ్యరావు పోటీ