Khushbu : హాస్పిటల్ లో కుష్బూ.. మళ్ళీ అదే వ్యాధికి ట్రీట్మెంట్.. ప్రార్థిస్తున్న అభిమానులు..

తాజాగా కుష్బూ మరోసారి హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ కుష్బూ తన ట్విట్టర్ లో..

Published By: HashtagU Telugu Desk
Khushbu joined in Hospital for Tail Bone Treatment

Khushbu joined in Hospital for Tail Bone Treatment

ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసిన కుష్బూ(Khushbu) ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలతో కూడా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడు(Tamilanadu) బీజేపీ(BJP)లో ముఖ్య పాత్ర పోషిస్తుంది కుష్బూ.

అయితే గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కొన్నాళ్ల క్రితమే రెండు సార్లు హాస్పిటల్ లో చేరినట్టు ఆమె స్వయంగా తెలిపారు. తాజాగా కుష్బూ మరోసారి హాస్పిటల్ లో చేరింది.

హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ కుష్బూ తన ట్విట్టర్ లో.. టైల్ బోన్ కు సంబంధించిన చికిత్స కోసం నేను మళ్ళీ హాస్పిటల్ కి వచ్చాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పూర్తగా నయమవుతుందని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేసింది. టైల్ బోన్ అంటే వెన్నెముక చివర ఉండే తోక ఎముక. గతంలో కూడా ఇదే బాధతో హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కానీ పూర్తిగా నయం కాకపోవడంతో మరోసారి కుష్బూ ఆసుపత్రి పాలయ్యారు. కుష్బూ ఇలా హాస్పిటల్ లో చేరడంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Also Read : Adipurush : జపాన్‌లో రిలీజ్ అవ్వలేదని.. సింగపూర్ వచ్చి ఆదిపురుష్ చూసిన ప్రభాస్ జపాన్ మహిళా అభిమాని..

  Last Updated: 23 Jun 2023, 10:02 PM IST