Khaleja : ఖలేజా టైటిల్‌ విషయంలో అత్యాశకు పోయి.. 10లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి..

ఈ మూవీ టైటిల్ విషయంలో అప్పటిలో పెద్ద రచ్చే జరిగింది. 'ఖలేజా' అనే టైటిల్ ని నిర్మాతల మండలిలో ఒక వ్యక్తి.. మహేష్ మూవీ కంటే ముందే రిజిస్టర్‌ చేయించుకున్నాడు.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 10:00 PM IST

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘ఖలేజా'(Khaleja). టైటిల్ తోనే ఈ మూవీ భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని మెప్పించినా కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ మూవీ టైటిల్ విషయంలో అప్పటిలో పెద్ద రచ్చే జరిగింది. ‘ఖలేజా’ అనే టైటిల్ ని నిర్మాతల మండలిలో ఒక వ్యక్తి.. మహేష్ మూవీ కంటే ముందే రిజిస్టర్‌ చేయించుకున్నాడు.

ఆ తరువాత మహేష్, త్రివిక్రమ్ తమ మూవీకి సేమ్ టైటిల్ ని అనౌన్స్ చేయడంతో.. ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించి సినిమా రిలీజ్ అవ్వకుండా ఆర్డర్‌ ఇవ్వాలంటూ కోరాడు. ఇక ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆధారాలన్నీ పరిశీలించిన న్యాయమూర్తి.. ఇప్పటికే వాళ్ళు షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్నారు. ఈసమయంలో విడుదలను ఆపమనడం సమంజసం కాదు. కాబట్టి మీరు నష్టపరిహారం కోరవచ్చు అని ఆ వ్యక్తికి సూచన చేశారు.

దీనికి ఆ వ్యక్తి కూడా అంగీకరించి రూ.10లక్షల పరిహారం కోరాడు. అందుకు మహేష్ బాబు మూవీ నిర్మాతలు కూడా ఒకే చెప్పారు. భోజన విరామం తర్వాత తుది తీర్పును న్యాయమూర్తి ప్రకటిస్తామంటూ వెల్లడించారు. అయితే ఇంతలో ఆ వ్యక్తి మనసు మారింది. తనకి 10లక్షలు కాదు 25లక్షలు ఇవ్వాలని కోరాడు. ముందు 10 లక్షలకు ఒకే అని, ఇప్పుడు 25 అనడంతో కొంతసేపు వాదోపవాదనలు జరిగాయి.

ఈ వాదనలు అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసు పై ఇప్పుడే తుది తీర్పుని ఇవ్వలేము. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలతో మళ్లీ రండి అంటూ చెప్పి ఆ వ్యక్తికి షాక్ ఇచ్చింది. అంతేకాదు అప్పటివరకు మహేష్ మూవీ రిలీజ్ ని కూడా ఆపలేము అంటూ చెప్పింది. ఇక మహేష్ మూవీ నిర్మాతలు.. తీర్పు ఎలా వచ్చినా సమస్య లేకుండా ‘మహేష్ ఖలేజా’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి అనవసరంగా అత్యాశకు పోయి 10లక్షలు పోగుట్టుకునట్లు అయ్యింది.

 

Also Read : Exclusive: ‘ఆర్ఎక్స్ 100’కి, ‘బెదురులంక 2012’కు యాదృశ్చికంగా అలా కుదిరింది – హీరో కార్తికేయ ఇంటర్వ్యూ