Site icon HashtagU Telugu

Toxic : KGF యశ్ నెక్స్ట్ సినిమా ‘టాక్సిక్’ గ్లింప్స్ వచ్చేసింది..

KGF Star Yash Next Movie Toxic Glimpse Released

Yash

Toxic Glimpse : కన్నడ స్టార్ స్టార్ యశ్ KGF సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాక కన్నడ సినిమా స్థాయిని పెంచాడు. ఒక్కసారిగా కన్నడ సినిమాకు సరికొత్త వైభవం తెచ్చాడు. KGF రెండు భాగాలు భారీ విజయాలు సాధించి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. KGF 3 కూడా ఉందని వార్తలు వచ్చినా అది ఇప్పట్లో లేదని తెలుస్తుంది.

KGF తర్వాత యశ్ ఎలాంటి సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ తో పాటు కన్నడ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇటీవల KGF తర్వాత యశ్ నెక్స్ట్ సినిమా టాక్సిక్ ని ప్రకటించారు. KVN ప్రొడక్షన్స్ లో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ నెక్స్ట్ సినిమాగా టాక్సిక్ అనౌన్స్ చేసారు. తాజాగా నేడు యశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. మీరు కూడా యశ్ టాక్సిక్ గ్లింప్స్ చూసేయండి..

ఈ గ్లింప్స్ లో.. యశ్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇది కూడా ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని అర్ధమవుతుంది. యశ్ మళ్ళీ అదే KGF గెటప్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

 

Also Read : Ram Charan : బాలీవుడ్ లో ఆ సినిమా చేసినందుకు రామ్ చరణ్ బాధపడ్డాడట..