KGF Star Yash : అర్ధరాత్రి చిన్న కిరాణా షాప్ లో KGF హీరో..

KGF మూవీ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న హీరో యాష్ (Yash). ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన KGF సిరీస్ ..యాష్ ను అగ్ర హీరోను చేసింది. ఈ మూవీ తో తెలుగు అడియాన్స్ కు సైతం బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న యాష్..తాజాగా అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ (స్మాల్ Shop) లో ఐస్ క్రీం కొంటూ కనిపించాడు. అది కూడా తన కోసం కాదు..తన భార్య […]

Published By: HashtagU Telugu Desk
Yash

Yash

KGF మూవీ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న హీరో యాష్ (Yash). ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన KGF సిరీస్ ..యాష్ ను అగ్ర హీరోను చేసింది. ఈ మూవీ తో తెలుగు అడియాన్స్ కు సైతం బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న యాష్..తాజాగా అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ (స్మాల్ Shop) లో ఐస్ క్రీం కొంటూ కనిపించాడు. అది కూడా తన కోసం కాదు..తన భార్య (Radhika) కోసం.

We’re now on WhatsApp. Click to Join.

తన భార్య రాధిక పండిట్, పిల్లలు ఐరా,యథర్వ్‌లతో కలిసి కర్ణాటక షిరాలీలోని చిత్రపూర్ మఠానికి వెళ్లారు. ఆ సందర్భంలో రాత్రివేళ షిరాలీ గ్రామంలోని ఓ చిన్న కిరాణా షాపు బయట యష్ కనిపించారు. తన భార్య కోసం ఐస్ క్యాండీ కొన్నారు. ఆ ఫోటోలో భార్య రాధిక కూడా ఉన్నారు. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ తమ అభిమానాన్ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు.

Read Also : Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం

  Last Updated: 17 Feb 2024, 03:50 PM IST