తొలి సినిమానే కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన తదుపరి సినిమాల విషయంలో దూకుడు చూపించట్లేదని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కేజిఎఫ్ మొదటి రెండు భాగాలతో నేషనల్ లెవెల్ లో సూపర్ సంపాదించింది అమ్మడు. ఆ సినిమా తర్వాత చియాన్ విక్రమ్ తో కోబ్రా సినిమాలో నటించింది శ్రీనిధి. కోబ్రా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కెరియర్లో వెనక పడ్డది.
తెలుగు నుండి ఒకటి రెండు ఆఫర్లు వస్తున్నా సరే పెద్దగా పట్టించుకోని శ్రీనిధి శెట్టి ఇప్పుడు మళ్లీ అదే టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారబోతుంది. ఇప్పటికే స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న తెలుసు కదా సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది శ్రీనిధి. ఇక వీటితో పాటే లేటెస్ట్ గా ఒక బంపర్ ఆఫర్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తోనే స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అందుకుందట అమ్మడు.
పవన్ కళ్యాణ్ వీరమల్లు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu). పవన్ డేట్స్ కోసం ఇప్పటికీ ఈ సినిమా దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ కల్లా ఎలాగైనా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్. ఈ క్రమంలో వీరమల్లు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కేజిఎఫ్ హీరోయిన్ ని అడిగినట్టు టాక్. శ్రీనిధి కూడా తెలుగులో ఒక స్టార్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. అందుకు తగినట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఎంపికైందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో శ్రీనిధి శెట్టి ఛాన్స్ నిజమే అయితే అమ్మడి మరి ఫేట్ మారినట్టే అని చెప్పొచ్చు. కేవలం రెండు సినిమాలు తోనే సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ పెంచుకున్న అమ్మడు ఇలా సినిమా లేకుండా ఇంట్లో కూర్చోవడం మాత్రం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీనిధి తెలుగు ఎంట్రీ కచ్చితంగా ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు.