KGF 2 box office: “కేజీఎఫ్-2” కలెక్షన్ల వరద..నేడో, రేపో రూ.1000 కోట్లకు!!

"కేజీఎఫ్-2" సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల తో దుమ్ము లేపుతోంది.

Published By: HashtagU Telugu Desk
Kgf2 Yash

Kgf2 Yash

“కేజీఎఫ్-2” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల తో దుమ్ము లేపుతోంది. మరో ఒకటి రెండు రోజుల్లో దాని కలెక్షన్లు రూ.1000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. తాజాగా 16వ రోజైన శనివారం ప్రపంచవ్యాప్తంగా రూ.15.28 కోట్ల కలెక్షన్స్ జరిగాయి.దీంతో ఇప్పటివరకు జరిగిన కలెక్షన్స్ విలువ రూ.959.10 కోట్లకు పెరిగింది. ఈవిషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విట్టర్ వేదికగా శనివారం ప్రకటించారు.

ఏప్రిల్ 14న ఈ మూవీ విడుదలైంది. మొదటి వారంలో రూ.720.31 కోట్లు, రెండోవారంలో రూ.223.51 కోట్లు, మూడో వారంలో మొదటి రోజైన శనివారం రూ.15.28 కోట్ల కలెక్షన్స్ జరిగాయి. కలెక్షన్స్ ఇదే రేంజ్ లో జరిగితే రూ.1000 కోట్ల మైలురాయిని “కేజీఎఫ్-2” సినిమా త్వరలోనే దాటడం పెద్ద కష్టమేం కాదు. ఈ మూవీ చివరి సీన్ ను బట్టి.. “కేజీఎఫ్-3” కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

  Last Updated: 30 Apr 2022, 01:39 PM IST