Prabhas :ప్రభాస్ కు మాట సాయం చేసిన కెజిఎఫ్ విలన్

కన్నడ నటుడు వశిష్ఠ సింహ 'సలార్' టీమ్‌తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు గట్టిగా ధ్వనించే కంఠంతో వాయిస్ అందిస్తున్నాడు

Published By: HashtagU Telugu Desk
Prabhas Dubbing

Prabhas Dubbing

బాహుబలి తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నప్పటికీ సరైన హిట్ పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు హ్యాట్రిక్ ప్లాప్స్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ తో పాటు ఆయన అభిమానుల ఆశలన్నీ సలార్ పైనే ఉన్నాయి. కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్..సలార్ (Salaar) ను డైరెక్ట్ చేస్తుండడం తో అందరి చూపు దీనిపై ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా సాగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా శ్రుతి హాసన్ నటించగా, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, దేవరాజ్ సహా పెద్ద తారగణమే ఈ సినిమాలో ఉన్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న సలార్‌.. కన్నడలో ప్రభాస్ పాత్రకు నటుడు వశిష్ఠ సింహ (KGF actor Vasishta N Simha to dub for Prabhas) వాయిస్‌ ఇస్తున్నాడు. కన్నడ నటుడు వశిష్ఠ సింహ ‘సలార్’ టీమ్‌తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు గట్టిగా ధ్వనించే కంఠంతో వాయిస్ అందిస్తున్నాడు. ఈ వార్త విని అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్‌కు ఆయన వాయిస్‌ బేస్‌ కరెక్ట్‌గా సెట్‌ అవుతుందని వారు అంటున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read Also : Diwali Holiday: దీపావళికి సెలవు, తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన!

  Last Updated: 01 Nov 2023, 01:22 PM IST