Site icon HashtagU Telugu

KGF 2: ఈ యువతి రాఖీబాయ్ కి తల్లి!

Kgf2

Kgf2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ టైటిల్ రోల్ లో నటించిన కేజీఎఫ్2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. త్వరలోనే ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఇప్పటికే తమిళనాడులో వంద కోట్లు వసూళ్లు సాధించి సత్తా చాటుతోంది. అయితే  ఈ సినిమా పేరు చెప్పగానే రాఖీభాయ్ పేరు ఎలా గుర్తుకువస్తుందో, రాఖీభాయ్ కు తల్లిగా నటించిన అర్చన జోష్ కూడా ప్రేక్షకుల మదిలో మెదులుతోంది. రాఖీ బాయ్ తల్లిగా చేసిన అమ్మాయి ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈమె వయసు కేవలం 27 మాత్రమే అంటే ఎవరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే. అర్చన  తన స్టడీస్ ను కంప్లీట్ చేశాకా కథాకళి లో బ్యాచిలర్ డిగ్రీ కూడా చేసింది.  హీరో యశ్ లాగే సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత  కేజీఎఫ్ చాప్టర్ 2 లో రాఖీ బాయ్ తల్లిగా నటించి ఆకట్టుకుంది. చిన్న వయసులోనే అమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది. అర్చన నటనకు పిల్లల నుంచి పెద్దల వరకు ఫిదా అవుతున్నారు.

Exit mobile version