Site icon HashtagU Telugu

Mohan Babu: మోహన్‌ బాబు ఎపిసోడ్‌లో కీల‌క ట్విస్ట్‌!

Mohan Babu

Mohan Babu

Mohan Babu: మంచు మోహ‌న్ బాబు (Mohan Babu) ఎపిసోడ్‌లో కీల‌క ట్విస్ట్ చోటుచేసుకుంది. మీడియాపై దాడి చేసిన కేసులో పోలీసులు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ఇప్ప‌టికైతే మోహన్ బాబు స్టేట్‌మెంట్‌ తీసుకోలేదని పోలీసులు వెల్ల‌డించారు. మోహన్ బాబు కుటుంబసభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చార‌ని పోలీసులు వివ‌రించారు. విచారణ సమయంలో తన గన్‌ అప్పగిస్తానని మోహ‌న్ బాబు పోలీసుల‌కు చెప్పిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం మోహన్ బాబు ఎక్కడున్నాడో సమాచారం లేద‌ని పోలీసులు బాంబు పేల్చారు. మోహన్ బాబు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని మంచు కుటుంబ స‌భ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. పరారీలో లేనని మోహ‌న్ బాబు శ‌నివారం ట్విట్‌ చేసిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల తర్వాత వ‌స్తాన‌ని మోహన్ బాబు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మోహన్‌బాబు గన్‌ను సీజ్‌ చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Also Read: Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌!

మోహ‌న్ బాబుపై ఇప్ప‌టికే హ‌త్యాయ‌త్నం కేసు?

ఇక‌పోతే మంచు మోహ‌న్ బాబుపై ఇప్ప‌టికే హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. మ‌నోజ్‌- మోహ‌న్ బాబు వివాదంలో మీడియా క‌వ‌రేజ్ కోసం వెళ్లిన జ‌ర్న‌లిస్టుల‌పై మోహ‌న్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో ప్ర‌ముఖ టీవీ ఛానెల్ రిపోర్ట‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. రిపోర్ట‌ర్ ప్ర‌స్తుతం వైద్య చికిత్స‌ల నిమిత్తం ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

మ‌నోజ్‌- మోహ‌న్ బాబు వివాదం కాస్త స‌దుమ‌ణిగింది. అయితే అంత‌ర్గ‌తంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌పై కావాల‌నే లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంచు మ‌నోజ్ ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు మోహ‌న్ బాబు సైతం మ‌నోజ్ తాగుడుకు బానిస అయ్యాడ‌ని, ఆస్తుల కోస‌మే ఇదంతా చేస్తున్నాడుని ఆరోపించారు. ఇరువురు ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. పోలీసులు మంచు మ‌నోజ్‌ను మంచు విష్ణును పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి సంవ‌త్స‌రం పాటు వివాదాలు జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని బాండ్ రాసి ఇచ్చారు.