Awards : తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక మీదట ప్రతిఏటా అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని వివరించింది. తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని తెలిపింది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు ఫిల్మ్ ఛాంబర్ అప్పగించింది.
Read Also: Defection MLAs : సీఎల్పీ భేటీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం.. ఎందుకు ?
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మురళీమోహన్ , రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతల కంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ అని అన్నారు. రాజకీయ నేతలకు పదవీకాలం పూర్తయితే ప్రజల్లో ఆదరణ ఉండదు.. కానీ సినిమా వాళ్ల విషయంలో ప్రజలు అలా ఉండరు అని తెలిపారు. మద్రాసులో ఉన్నప్పుడు తమది సినిమా కులమని గర్వంగా చెప్పుకునే వాళ్లమని గుర్తుచేశారు.
Read Also: Virat Kohli: తొలి మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ .. కారణం గాయమేనా?