Ketika Sharma : కెతిక శర్మ మాస్టర్ పీస్ అందాలు..!

Ketika Sharma డబ్ స్మాష్ బ్యూటీ కెతిక శర్మ ఆ వీడియోలతోనే సూపర్ పాపులర్ అయ్యింది. ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 10:40 AM IST

Ketika Sharma డబ్ స్మాష్ బ్యూటీ కెతిక శర్మ ఆ వీడియోలతోనే సూపర్ పాపులర్ అయ్యింది. ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ సినిమాతో బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్నా ఆ తర్వాత పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. విశ్వక్ సేన్ తో లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలు చేసిన కెతిక వాటి ఫలితాలు నిరాశపరచడంతో కెరీర్ డైలమాలో పడింది.

చివరగా పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కూడా నటించినా లాభం లేకుండాపోయింది. కెతిక శర్మ సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ తో రెచ్చిపొతుంది. లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ తో అదరగొట్టేసింది. కొందరు తనని మెస్ అని అన్నా.. కొందరు మాత్రం మాస్టర్ పీస్ అంటారని తన గురించి ఎవరేం అనుకున్నా సరే తనకు అక్కర్లేదని చెప్పకనే చెబుతుంది అమ్మడు.

Also Read : Akhanda 2 : అఖండ 2 చాలా పెద్ద ప్లానింగే చేస్తున్నారు..!

గ్లామర్ షో విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని హింట్స్ ఇస్తున్న కెతిక కెరీర్ లో ఒక సక్సెస్ పడితే చాలు తన సత్తా చాటుతా అంటుంది అమ్మడు. ఐతే సినిమా ఆఫర్లు ఎలా ఉన్నా కెతిక ఫోటో షూట్స్ ని చూసేందుకు మాత్రం ఆమె ఫాలోవర్స్ ఆస్క్తిగా ఉన్నారు. అందుకే వారి కోసమే క్రమం తప్పకుండా రకరకాల ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలుస్తుంది కెతిక శర్మ. కచ్చితంగా అమ్మడికి త్వరలో ఒక లక్కీ ఆఫర్ రావాలని కోరుతున్నారు ఆమె ఫాలోవర్స్.