Site icon HashtagU Telugu

Kethika Sharma : నెటిజన్ ప్రపోజల్ కి కెతిక రియాక్షన్.. నోరు మూసుకుని మరీ..!

Ketika Sharma

రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ (Kethika Sharma) తన గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ ని తన బుట్టలో పడేసేలా చేస్తుంది. ఆకాష్ పూరీ తో రొమాంటిక్ సినిమా చేసిన అమ్మడు ఆ తర్వాత నాగ శౌర్యతో లక్ష్య సినిమా చేసింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా ఛాన్స్ కూడా అందుకుంది. అయితే ఇవేవి అమ్మడికి లక్ తీసుకు రాలేదు. ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో కెతిక శర్మ ఎక్కువ అవకాశాలు అందుకోలేదు.

సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం కెతిక శర్మ అదరగొడుతుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో అలరించే కెతిక లేటేస్ట్ గా తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా ఒక నెటిజన్ అమ్మడిని ఒక వింత ప్రశ్న అడిగాడు. ఇంతకీ అతను ఏమన్నాడు అంటే నీకు ఆల్జీబ్రా వచ్చా వస్తే.. నువ్వు ఎందుకు అని అడక్కుండా నా ఎక్స్ ని రీప్లేస్ చెయ్యి అని అన్నాడు.

నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాక కెతిక శర్మ షాక్ అవుతూ నోరు మూసుకుని ఉన్న ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడి ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్లామర్ విషయంలో తిరిగు లేకుండా ఉన్న కెతిక శర్మ వాటిని అవకాశాల రూపంలో మలచడంలో విఫలమవుతుంది. మరి కెతిక టాలెంట్ గుర్తించి ఎవరైనా ఛాన్స్ ఇస్తే బెటర్ అని చెప్పొచ్చు.

Also Read : Keerti Suresh : మహానటిగా కీర్తి సురేష్ రాంగ్ చాయిస్.. యాక్టర్ కం డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!