Site icon HashtagU Telugu

Kerala Boycott Leo: ట్రెండింగ్ లో “కేరళ బాయ్‌కాట్ లియో” హ్యాష్‌ట్యాగ్.. కారణమిదే..?

KeralaBoycottLeo

Is Vijay Leo Inspired With

Kerala Boycott Leo: ప్రముఖ నటుడు విజయ్ దళపతికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాలంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న ‘లియో’ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కమల్ తో విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం.. మరోవైపు విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే దీనికి ముందు ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కేరళ బాయ్‌కాట్ లియో (KeralaBoycottLeo) అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ లో ఉంది.

ఈ చిత్రాన్ని కేరళలో బాయ్‌కాట్ చేయమంటూ ఓ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #KeralaBoycottLEO అంటూ ట్రెండ్ అవుతున్న ఈ హ్యాష్ ట్యాగ్ గురించే ఇప్పుడు సినీ అభిమానులు మాట్లాడుతున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాని కేరళలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. అందుకు కారణమేమిటనేది చాలా మందికి తెలియటం లేదు. అయితే అందుకు కారణం అంటూ ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Bigg Boss 7 : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దామిని వీడియో.. నాగ్ ఏమంటాడో..?

సోషల్ మీడియా డిస్కషన్స్ లో కేరళలోని కొందరు మోహన్ లాల్ అభిమానులు, విజయ్ అభిమానులు మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి నటించిన జిల్లా చిత్రంలో విజయ్ నటన మోహన్ లాల్ ముందు తేలిపోయిందని మోహన్ లాల్ ఫ్యాన్స్ అన్నారు. అది విజయ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. మోహన్ లాల్ నటన చాలా చిత్రాల్లో చెత్తగా ఉందంటూ క్లిప్ లు, ఫోటోలు షేర్ చేయటం మొదలెట్టారు. ఈ క్రమంలో ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. మోహన్ లాల్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ కు వ్యతిరేకంగా #KeralaBoycottLEO అంటూ హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దీనిని పలువురు ఫ్యాన్స్ షేర్ చేయటం,రీ ట్వీట్ చేయటం మొదలెట్టారు.

ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే.. లియో మూవీ ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తి అయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ సహా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లియో మూవీని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు.