Keerty Suresh : కీర్తి సురేష్ కూడా వాటికి రెడీ.. డిమాండ్ పెరగాలంటే డోస్ పెంచాలని ఫిక్స్ అయిన అమ్మడు..!

మహానటి కీర్తి సురేష్ (Keerty Suresh) బాలీవుడ్ కి ప్రమోట్ అయ్యింది. ఇన్నాళ్లు సౌత్ సినిమాలతో అలరించిన అమ్మడు ఇప్పుడు బీ టౌన్ ఆడియన్స్ ని కూడా మెప్పించాలని చూస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Keerty Suresh Lip Lock In Bollywood Movie

Keerty Suresh Lip Lock In Bollywood Movie

మహానటి కీర్తి సురేష్ (Keerty Suresh) బాలీవుడ్ కి ప్రమోట్ అయ్యింది. ఇన్నాళ్లు సౌత్ సినిమాలతో అలరించిన అమ్మడు ఇప్పుడు బీ టౌన్ ఆడియన్స్ ని కూడా మెప్పించాలని చూస్తుంది. కీర్తి సురేష్ హిందీలో చేస్తున్న మొదటి సినిమా బేబీ జాన్. ఈ సినిమాలో వరుణ్ ధావన్ తో అమ్మడు జత కడుతుంది. అయితే సౌత్ లో సినిమాల్లో గ్లామర్ సైడ్ పర్వాలేదు అనిపించిన కీర్తి సురేష్ ఇక్కడ హీరోలతో లిప్ లాక్స్ మాత్రం నో అనేసింది. కానీ బాలీవుడ్ కి వెళ్లగానే అక్కడ మాత్రం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

కీర్తి సురేష్ నటిస్తున్న బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ తో అమ్మడు లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్ లిప్ లాక్ ఉంటుందని తెలుసి ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇన్ని సినిమాలు చేసినా సరే కీర్తి సురేష్ ఇక్కడ ఏ హీరోకి లిప్ లాక్ ఇవ్వలేదు. బాలీవుడ్ వెళ్లగానే అక్కడ అందుకు ఓకే అనేసింది.

అయితే సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ మేరకు కీర్తి అందుకు ఒప్పుకుందని అంటున్నారు. ముందు లిప్ లాక్ కి కీర్తి సురేష్ నో చెప్పినా తర్వాత అందుకు ఓకే అనేసిందట. అంతేకాదు ఈ సినిమాలో లిప్ లాక్ ఉన్నందుకు అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేసిందని తెలుస్తుంది. మొత్తానికి మహానటి కూడా అదరచుంబనం చేయడం ఆమె ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.

Also Read : Andrea Jeremiah : అలా చూస్తూ చూపుల వల్లో పడేస్తున్న అమ్మడు..!

  Last Updated: 20 Feb 2024, 07:51 AM IST