Site icon HashtagU Telugu

Keerti Suresh : మహానటిగా కీర్తి సురేష్ రాంగ్ చాయిస్.. యాక్టర్ కం డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Love Proposals for Keerti Suresh from Fan

Love Proposals for Keerti Suresh from Fan

Keerti Suresh నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన సినిమా మహానటి. వైజయంతి మూవీస్ లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మహానటి పాత్రలో కీర్తి సురేష్ అభినయానికి జాతీయ అవార్డు కూడా అందుకుంది. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాలో లీడ్ రోల్ కి కీర్తి సురేష్ ని ఎంపిక చేయడంపై యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ మొదట డిజప్పాయింట్ అయ్యాడట.

మహానటి సావిత్రి కథకు కీర్తి సురేష్ ఎలా సూట్ అవుతుంది. నాగ్ అశ్విన్ రాంగ్ చాయిస్ ఎంచుకున్నాడేంటని అనుకున్నాడట. ఎందుకంటే అప్పటివరకు కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలే చేసింది. ఆమె ఎలా సావిత్రిగా మెప్పించగలదు. సావిత్రి కథలో ఎమోషన్స్ పండించాలంటే చాలా కష్టం. కానీ తన ఆలోచనలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసింది కీర్తి సురేష్. సినిమాలో ఆమె నటనకు షాక్ అయ్యానని రీసెంట్ ఇంటర్వ్యూలో అవసరాల శ్రీనివాస్ అన్నారు.

మలయాళంలో సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆడియన్స్ లో ఆమె క్రేజ్ ని చూసిన నాగ్ అశ్విన్ సావిత్రి పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అనుకున్నారు. అయితే ముందు సావిత్రి పాత్రకు నిత్యా మీనన్ ని ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేదు. ఫైనల్ గా కీర్తి సురేష్ కి ఆఫర్ వచ్చి ఆమె సూపర్ హిట్ చేసింది.

Also Read : Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ హీరో అతనేనా..?