Keerti Suresh : మహానటి ఆ ఒక్క పని వల్ల దారుణమైన ట్రోల్స్..!

కీర్తి సురేష్ తను నటించిన రఘుతాత (Raghutata Event) సినిమా ఈవెంట్ కు వచ్చింది. ఐతే ఈవెంట్ కి శారీనే కట్టుకుని వచ్చిన కీర్తి సురేష్ జాకెట్ ని మాత్రం వెరైటీగా

Published By: HashtagU Telugu Desk
Keerti Suresh Trolled By Her Dressing Raghutata Event

Keerti Suresh Trolled By Her Dressing Raghutata Event

మహానటి కీర్తి సురేష్ చేసిన ఒక పని వల్ల ఇప్పుడు ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తన నటనతో సౌత్ ఆడియన్స్ ని కట్టిపడేస్తున్న అమ్మడు ఈమధ్య గ్లామర్ విషయంలో కూడా హద్ధులు చెరిపేస్తుంది. అదేంటో అలా బాలీవుడ్ కి వెళ్లి ఒక సినిమా చేసిందో లేదో ఇలా కీర్తిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతకుముందు కీర్తి చాలా ట్రడిషనల్ గా కనిపించేది కానీ ఈమధ్య అమ్మడు బాలీవుడ్ కల్చర్ అలవరచుకుని చూపరులను ఆకట్టుకునేలా తయారయి వస్తుంది.

లేటెస్ట్ గా కీర్తి సురేష్ తను నటించిన రఘుతాత (Raghutata Event) సినిమా ఈవెంట్ కు వచ్చింది. ఐతే ఈవెంట్ కి శారీనే కట్టుకుని వచ్చిన కీర్తి సురేష్ జాకెట్ ని మాత్రం వెరైటీగా వేసుకుంది. దాదాపు వీపు మొత్తం కనిపించేలా అమ్మడు జాకెట్ ఉంది. అంతేకాదు ముందు భాగం కూడా ఎప్పుడు సరిచేసుకుంటూనే ఉంది. ఇలా ఇబ్బంది పడే డ్రెస్సులను వేసుకోవడం మళ్లీ వాటి వల్ల ఇలా ప్రతిసారి సరిచేసుకోవడం ఎందుకని ఆడియన్స్ అంటున్నారు.

అంతేకాదు కీర్తి సురేష్ (Keerti Suresh) బాలీవుడ్ వెళ్లి చాలా మారిపోయిందని అనుకుంటున్నారు. రఘుతాత ఈవెంట్ లో కీర్తి సురేష్ ని చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ఆమె గురించి డిస్కషన్స్ పెట్టేశారు. బాలీవుడ్ లో కీర్తి సురేష్ బేబీ జాన్ (Baby John) అనే సినిమా చేసింది. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత మరో క్రేజీ ఆఫర్ కూడా అందుకుందని తెలుస్తుని. బాలీవుడ్ ఆడియన్స్ కి కీర్తి తన గ్లామర్ తో కిక్ ఇవ్వాలని చూస్తుంది.

సౌత్ లో తన అభినయంతో మెప్పించిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో మాత్రం గ్లామర్ యాంగిల్ చూపించడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. మరి కీర్తి సురేష్ బాలీవుడ్ కెరీర్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.

Also Read : Prabhas : ప్రభాస్ కోసం పాకిస్థాన్ భామని తీసుకొస్తున్న హను రాఘవపూడి.. నిజమేనా..!

  Last Updated: 22 Jul 2024, 11:10 AM IST