Site icon HashtagU Telugu

Keerti Suresh : 233 లెటర్స్.. ఫైనల్ గా రిప్లై ఇచ్చిన కీర్తి సురేష్.. సారీ చెప్పి మరీ..!

Keerti Suresh Fully Focus on Bollywood

Keerti Suresh Fully Focus on Bollywood

మహానటి కీర్తి సురేష్ (Keerti Suresh) మలయాళ పరిశ్రమ నుంచి వచ్చి సౌత్ అంతా సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్న కీర్తి సురేష్ తను చేసే సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉంటుంది అమ్మడు.

We’re now on WhatsApp : Click to Join

తనకు ఇంత క్రేజ్ తెచ్చిన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి రెగ్యులర్ అప్డేట్స్ తో టచ్ లోనే ఉంటుంది. లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో మరోసారి చిట్ చాట్ చేసిన కీర్తి సురేష్ తన అభిమానికి సారీ చెప్పింది. ఇంతకీ ఎందుకు ఆమె ఫ్యాన్ కి సారీ చెప్పింది అంటే అతను కీర్తి సురేష్ కోసం ఎన్నోసార్లు లెటర్స్ రాశాడట కానీ ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదట.

కీర్తి సురేష్ ఫ్యాన్స్ అంతా కూడా ఆమె కోసం మెసేజ్ లు చేస్తుంటారు. అందరికీ రిప్లై ఇవ్వడం ఆమె వల్ల కాదు. తను స్పెషల్ చిట్ చాట్ చేసే ఆ టైం లో కొందరికి ఆన్సర్ ఇస్తుంది. అయితే ఒక అభిమాని కీర్తి సురేష్ కోసం ఏకంగా 233 సార్లు లెటర్స్ రాశాడట. కానీ ఆమె ఏ ఒక్క దానికి ఆన్సర్ ఇవ్వలెదట. నిన్న అదే విషయాన్ని చెప్పగా కీర్తి సురేష్ అతనికి సారీ చెప్పింది. అంతేకాదు 234 లెటర్స్ రాశాడని తెలిసి. 234 తనకు నచ్చిన నెంబర్ అని చెప్పింది.

మహానటి ముందు వరకు కీర్తి సురేష్ అందరిలాంటి హీరోయినే అనుకున్నారు కానీ ఎప్పుడైతే మహానటి వచ్చిందో అప్పటి నుంచి ఆమె క్రేజ్ డబుల్ అయ్యింది. అటు స్టార్స్ తో పాటుగా టైర్ 2 హీరోలతో నటిస్తూ సత్తా చాటుతుంది కీర్తి సురేష్.

Also Read : Ram Charan: కొడుకుగా గర్విస్తున్నా, చిరంజీవికి పద్మవిభూషణ్ పట్ల రామ్ చరణ్ ఎమోషనల్

తను చేసే సినిమాల్లో ఎలాంటి పాత్రతో అయినా మెప్పిస్తూ వస్తున్న కీర్తి సురేష్ సౌత్ లో అనతికాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. రానున్న సినిమాలతో అమ్మడు మరింత పాపులర్ అవ్వనుందని తెలుస్తుంది.