Keerti Suresh : అల్లు అర్జున్ అంటే లెక్క లేదా.. కీర్తి సురేష్ ఇలా షాక్ ఇచ్చిందేంటి..?

Keerti Suresh మహానటి కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషలతో పాటుగా ఈమధ్య బాలీవుడ్ లో కూడా ఛాన్సులు అందుకుంటుంది. కీర్తి ఎలాంటి పాత్ర చేసినా

  • Written By:
  • Publish Date - June 1, 2024 / 06:47 PM IST

Keerti Suresh మహానటి కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషలతో పాటుగా ఈమధ్య బాలీవుడ్ లో కూడా ఛాన్సులు అందుకుంటుంది. కీర్తి ఎలాంటి పాత్ర చేసినా సరే అదరగొట్టేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. ప్రస్తుతం కీర్తి సురేష్ కోలీవుడ్ లో రఘు తాత సినిమా చేస్తుంది. ఈ సినిమాను సుమన్ కుమార్ డైరెక్ట్ చేయగా డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్, హోంబలె ఫిలింస్ కలిసి నిర్మిస్తున్నారు.

సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించింది. ఐతే ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఆ డేట్ న పుష్ప రాజ్ వస్తున్నాడు. పుష్ప 1 సూపర్ హిట్ తర్వాత పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2 నుంచి వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమాపై భారీ హైప్ తెచ్చాయి. అందుకే అల్లు అర్జున్ పుష్ప 2 కి పోటీగా ఆగష్టు 15న ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు. ఐతే పుష్ప రాజ్ వస్తే ఏంటి మా రఘు తాతని ఏమి చేయలేడని ఫిక్స్ అయ్యారు ఆ చిత్ర యూనిట్.

అయితే పుష్ప 2 మీద ఈ సినిమా అంత ఇంపాక్ట్ చూపించదు కానీ పుష్ప 2 ఇంపాక్ట్ మాత్రం ఈ సినిమాపై కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అసలే థియేటర్లకు ఆడియన్స్ రావట్లేదని అంటుంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ టైం లో రఘు తాతని రిలీజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కీర్తి సురేష్ అండ్ టీం మాత్రం తమ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.

Also Read : Indian 2 : ఇండియన్ 2లో కమల్ కంటే సిద్దార్థ్ ఎక్కువ కనిపిస్తారట..