Site icon HashtagU Telugu

Keerti Suresh : కీర్తి ఫోకస్ అంతా అక్కడే..?

Keerti Suresh Fully Focus on Bollywood

Keerti Suresh Fully Focus on Bollywood

Keerti Suresh మహానటి కీర్తి సురేష్ తన కెరీర్ ని బాలీవుడ్ కి షిఫ్ట్ చేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. సౌత్ లో స్టార్ స్టేటస్ అందుకుని నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కీర్తి సురేష్ బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు రాగానే తన ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో దసరా తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోని అమ్మడు కోలీవుడ్ నుంచి వస్తున్న అవకాశాలను కూడా కాదంటుందట.

ముఖ్యంగా కీర్తి సురేష్ బాలీవుడ్ మీదే తన పూర్తి ఫోకస్ పెట్టింది కాబట్టే ఇలా మిగతా భాషల సినిమాలకు నో చెబుతుందని అంటున్నారు. తన ఫోకస్ అంతా హిందీ సినిమాల మీదే పెట్టిందని టాక్. ఇప్పటికే బేబీ జాన్ సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండు సినిమాల్లో చర్చల దశల్లో ఉంది కీర్తి సురేష్.

బాలీవుడ్ మేకర్స్ కి ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ మీద గురి కలిగింది. ఐతే అందివచ్చిన అవకాశాలను ఎందుకు కాదనాలి అనే ఉద్దేశంతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో దూసుకెళ్లిపోతుంది. ఈ క్రమంలో అమ్మడికి అక్కడ ఒక్క హిట్ పడినా సరే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. నటనలో తిరిగు లేని క్రేజ్ తెచ్చుకుంది కాబట్టి బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా కీర్తి అలరిస్తుందని అంటున్నారు.