కీర్తి సురేష్ (Keerthy Suresh) అద్బుతమైన నటి మాత్రమే అందాల ముద్దుగుమ్మ కూడా. అయితే ఎన్నో వర్కవుట్స్ చేసి బొద్దుగుమ్మ కాస్తా.. నాజూగ్గా తయారైంది. ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వర్కవుట్స్ చేయడం మాత్రం మానదు. యోగా (Yoga), డాన్స్, ఎక్సర్ సైజ్ లు చేస్తూ చక్కని ఫిజిక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ లేటెస్ట్ యోగా వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. పచ్చని పరిసరాల్లో యోగాతో మమేకమై ఎవరికి సాధ్యపడని ఆసనాలు, భంగిమలతో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ దసరా, భోళా శంకర్, సైర్, ఇతర సినిమాల్లో కనిపించబోతోంది.
కీర్తి సురేష్ Keerthy Suresh తెలుగులో వస్తూనే.. నేను శైలజతో హిట్ కొట్టింది. ఆ వెంటనే.. నేను లోకల్ తో మరో సక్సెస్ అందుకొని.. గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక మహానటితో.. ఉత్తమ జాతీయనటి అవార్డు దక్కించుకొని తన స్థాయి పెంచుకుంది కీర్తి సురేష్ Keerthy Suresh. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నా.. అజ్ఞాతవాసి ఫ్లాప్ తో పెద్ద హీరోలు ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. మహానటి తర్వాత కీర్తి సురేష్ (Keerthy Suresh) గుర్తుపట్టలేనంత సన్నంగా తయారైంది. బొద్దుగుమ్మ ఛాయలు ఏమాత్రం కనిపించలేదు. ఎందుకిలా సన్నబడింది.. బొద్దుగుమ్మగానే బాగుందన్న కామెంట్స్ చేశారు నెటిజన్లు. అయితే.. ఈ వెయిట్ లాస్ వెనకాల చాలా పెద్ద స్కెచ్చే వేసింది కీర్తి. ఇలా సన్నబడిందో లేదో.. రజినీకాంత్.. మహేశ్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.
Also Read: Bhola Shankar Update: భోళా శంకర్ కోసం భారీ కలకత్తా సెట్.. మెగాస్టార్ బిగ్గెస్ట్ సాంగ్