Site icon HashtagU Telugu

Kollywood : అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన కీర్తి తండ్రి

Anirudh Keerth

Anirudh Keerth

కోలీవుడ్ మ్యూజిక్ సంచలనం అనిరుద్ (Anirudh )..మ్యూజిక్ పరంగానే కాదు హీరోయిన్లతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో హీరోయిన్ ఆండ్రియా – అనిరుద్ (Andrea – Anirudh) లిప్ లాక్ (Lip Lock) పిక్స్ అనిరుద్ ను వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు హీరోయిన్ల తో అనిరుద్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు ప్రచారం జరిగాయి. ఈ మధ్య నటి కీర్తి సురేష్ (Keerthi Suresh) ను అనిరుద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కోలీవుడ్ లో వైరల్ గా మారాయి. ఈ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరి పిక్స్ కూడా బయటకు వచ్చాయి.ఆ పిక్స్ చూసి నిజమే కావొచ్చు..లేకపోతే అంత హత్తుకొని ఎందుకు ఉంటారంటూ అంత మాట్లాడుకున్నారు. రోజు రోజుకు వీరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున అంత మాట్లాడుకోవడం తో ఈ వార్తల ఫై కీర్తి తండ్రి సురేష్ (Suresh Kumar) క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియా & మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మీడియాలో వ‌స్తోన్న క‌థ‌నాల్ని అవాస్త‌వం. కీర్తిపై ఇలాంటి వార్త‌లు రావ‌డం కొత్తేం కాదు. గ‌తంలో కొంత మంది న‌టుల‌తో ముడిపెట్టి మాట్లాడారు. అప్పుడు వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ కానీ ఈసారి ఆ వార్త‌లు ప‌తాక స్థాయికి చేర‌డంతోనే స్పందించాల్సి వ‌స్తోంది. ద‌య‌చేసి అవాస్త‌వాలు ప్ర‌చురించొద్దు’ అని కోరారు. ఈయన క్లారిటీ ఇవ్వడం తో అనిరుద్ – కీర్తి పెళ్లి వార్తలు అవాస్తవమే అని తేలినట్లు అయ్యింది. ఇకనైనా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడతారో..అలాగే కొనసాగిస్తారో చూడాలి.

Read Also : Varun Tej- Lavanya Tripathi : మెగా ‘పెళ్లి సందడి ‘ మొదలైంది