Site icon HashtagU Telugu

Keerthy Suresh: దసరాలో కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ఇదే!

Keerthy

Keerthy

కీర్తిసురేష్ ‘దసరా’ లుక్ ఇదే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చి ఈ చిత్రం కోసం ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపిస్తున్నాడు నాని. ఈ పాత్ర కోసం మాస్, రగ్గడ్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

పసుపు రంగు చీరలో పెళ్లి టైమ్ లో డాన్స్ వేస్తూ ఎనర్జిటిక్ గా కనిపిస్తోంది కీర్తి. సినిమాలో కీర్తిసురేష్ కూడా మాస్ గానే కనిపిస్తోంది. ఆమెకు ఎలాంటి మేకప్ వేయలేదు. నాని-కీర్తి మధ్య వచ్చే లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్స్ అని చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ సినిమా ఇది. నాని ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తున్నాడు. ‘దసరా’ వచ్చే ఏడాది మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది.

 

Exit mobile version