Keerthy Suresh: విజయ్ దేవరకొండ మూవీలో కీర్తి సురేష్.. ఆ హీరోయిన్ తప్పుకోవడంతో?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 01 Feb 2024 08 21 Am 3886

Mixcollage 01 Feb 2024 08 21 Am 3886

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు విజయ్ దేవరకొండ. ఈ మూవీతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఖుషి సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతో అదే ఊపుతో ప్రస్తుతం వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ. అందులో భాగంగా ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ చేతిలో మరొక రెండు సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులుగా VD18 మూవీ గురించి అనేక వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలతో మొదలైంది ఈ చిత్రం. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు మూవీ మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ మూవీ నుంచి ఊహించని విధంగా శ్రీ లీల తప్పుకుందని టాక్ నడుస్తోంది. అయితే హీరోయిన్ శ్రీ లీల స్థానంలోకి మరొక హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుందని వార్తలు వచ్చాయి.

రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రుక్మిణి. దీంతో ఇప్పుడు విజయ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడిచింది. కానీ విజయ్ దేవరకొండ సినిమాలో నటించడం లేదని స్వయంగా క్లారిటీ ఇచ్చింది రుక్మిణి. అంతేకాకుండా ఈ మూవీలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైందట. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో కొత్త ప్రారంభం.. #VD18 అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో విజయ్ జోడిగా కీర్తి ఎంపికైనట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలపై నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడక తప్పదు మరి.

  Last Updated: 01 Feb 2024, 08:21 AM IST