Site icon HashtagU Telugu

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా.. అభిమానులకు షాక్ తప్పదా?

Keerthy Suresh

Keerthy Suresh

తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అలాగే హిందీలో బేబీ జాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

అయితే ఈ సినిమా కంటే ముందు కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో మూడు ముళ్ల బందంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత బాలీవుడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించడంతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ మూవీలో నటించింది. పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. మెడలో పసుపు తాడుతో కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే కీర్తి సురేష్ అక్క వెబ్ సిరీస్‌ లో నటించారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా పెళ్లి తర్వాత కీర్తి సినిమాలకు దూరం అవుతారన్న వార్తలు సోషల్ వైరల్ అవుతూ వస్తున్నాయి.

దానికి తోడు ఆమె వేస్తున్న అడుగులు అభిమానులకు అనుమానం కలిగించేలా ఉన్నాయి. కీర్తి సురేష్ వెండితెరను వదిలి బుల్లితెర పైకి వచ్చారు. స్టార్టప్ సింగం సినిమాలో పెట్టుబడిదారురాలిగా ఉన్నారు. ఇది పెట్టుబడి దారులను ఆకర్షించే కార్యక్రమం. దాంతో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను ఆపేశారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. భర్త బిజినెస్ మెన్ కావడంతో ఆ వైపు ఆమె అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాని సినిమాలు మానేస్తున్నా అని మాత్రం ఆమె ఎప్పుడుూ ప్రకటించలేదు. మరి ఈ విషయంలో అభిమానుల సందేహాలు తీరాలి అంటే కీర్తి సురేష్ స్పందించేవరకు వేచి చూడాల్సిందే మరి.