Site icon HashtagU Telugu

Keerthy Suresh : మంగళసూత్రంతో ప్రమోషన్లో పాల్గొన్న కీర్తి

Keerthy Suresh Spotted With

Keerthy Suresh Spotted With

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీని ఈనెల 12న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్​గా జరుగగా.. ఈ ఈవెంట్​కు కోలీవుడ్​ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. పెళ్లి అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే ఈ భామ తన సినిమా ప్రమోషన్ లలో బిజీ అయ్యింది. బాలీవుడ్‌ నటుడు వ‌రుణ్ ధవన్ (Varun Dhawan) లీడ్ రోల్‌లో బేబీ జాన్ (Baby John) అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ లో కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించడం తో పాటు ఈ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.

Kalees డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ , వీడియోస్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచగా..తాజాగా మేకర్స్ గ్రాండ్ గా ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్ కు కీర్తి రెడ్‌ డ్రెస్‌లో తళుక్కుమంది. అంతేకాదు మెడలో మంగళసూత్రంతో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటూ చెప్పకనే చెబుతోందంటున్నారు నెటిజన్లు, అభిమానులు, ఫాలోవర్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈమె తాలూకా వీడియోస్ , ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : Sanju Samson: ఐపీఎల్ 2025కి ముందు సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. జ‌ట్టు నుంచి ఔట్‌!