మహానటి (Mahanati) కీర్తి సురేష్ ఫైనల్ గా తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది. 15 ఏళ్లు ఇంకా కొనసాగుతుంది అంటూ ఆంటోనీ కీర్తి ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కీర్తి సురేష్. 15 ఏళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. కీర్తి సురేష్ ముందు మలయాళంలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేను శైలజతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ్ లో కూడా కీర్తి సురేష్ చాలా సినిమాలు చేసి అక్కడా స్టార్ క్రేజ్ సంపాదించింది.
ఐతే పెళ్లి విషయం ఎప్పుడు వచ్చినా మాట దాటేస్తూ వచ్చింది కీర్తి సురేష్ (Keerthy Suresh). కనీసం తన ప్రేమ వ్యవహారాన్ని కూడా ఆమె ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉంచింది. ఫైనల్ గా తన సోషల్ మీడియాలో ప్రేమ విషయాన్ని వెల్లడించింది కీర్తి సురేష్. కీర్తి ఆంటోని మ్యారేజ్ డిసెంబర్ 11, 12 తారీఖుల్లో గోవాలో జరుగుతుందని ఇప్పటికే మీడియాకు లీక్ అయ్యింది.
కీర్తి సురేష్ ఆంటోని కాలేజ్ డేస్ నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయమే ప్రేమగా మారి ఆమె కెరీర్ కు అండగా నిలబడింది. ఆంటోని (Anthony) ఒక బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. అంతకుముందు దుబాయ్ లో ఉన్న అతను ప్రస్తుతం కొచిలో బిజినెస్ మెన్ గా కొనసాగుతున్నారు. కీర్తి సురేష్ పెళ్లి మ్యాటర్ తెలిసి ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఇన్నాళ్లు ఆంటోనితో కీర్తి సైలెంట్ లవ్ స్టోరీ నడిపించింది. ఐతే కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Naga Chaitanya Shobhita : ఆ వార్తల్లో నిజం లేదంటున్న అక్కినేని కాంపౌండ్..!
15 years and counting ♾️🧿
It has always been..
AntoNY x KEerthy ( Iykyk) 😁❤️ pic.twitter.com/eFDFUU4APz— Keerthy Suresh (@KeerthyOfficial) November 27, 2024