Site icon HashtagU Telugu

Keerthy Suresh : తమిళ్ రాజకీయాల్లోకి కీర్తి సురేష్ ఎంట్రీ?

Keerthy Suresh

Keerthy Suresh

మహానటి ఫేం ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించడం, ఆ తర్వాత కీర్తి సురేశ్ రియాక్ట్ అవుతూ అవన్నీ రూమర్స్ అని తేల్చి చెప్పింది. తాజాగా ఈమె గురించి మరో వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ప్రముఖ నటి కీర్తి సురేష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలను అన్వేషిస్తోందని ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.  ఆమెకు సినిమాలతో పాటు రాజకీయాలపై ఆసక్తి ఉండవచ్చునని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇటీవల రాజకీయాల గురించి మాట్లాడటంతో కీర్తి పొలిటికల్ ఎంట్రీ వార్తలు నిజమే కావచ్చేమోనని భావిస్తున్నారు అభిమానులు

సూపర్ టాలెంటెడ్ అయిన కీర్తి సురేశ్ ‘మామన్నన్’, మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించింది. దీని నేపథ్యం రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ తారాస్థాయికి చేరుకున్నాయి. కీర్తి సురేష్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రకటన కోలీవుడ్ సర్కిల్ తో పాటు రాజకీయంగా చర్చనీయాంశమైనట్టు తెలుస్తోంది. ఇటీవల తన వైరల్ పెళ్లి వార్తలతో ముఖ్యాంశాలు చేసిన కీర్తి సురేష్ ఇప్పటికే తన వ్యక్తిగత జీవితం గురించి కొంత క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆమె రాజకీయ రంగంలోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్లు కొత్త పుకార్లు వచ్చాయి.

నేను శైలజ మూవీతో ఆకట్టుకున్న కీర్తి అందం, ప్రతిభతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. మహానటి సినిమా కీర్తి కెరీర్ కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత పలు కమర్షియల్ సినిమాలు చేస్తూ భారీ ఫాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడ విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. అయితే ఉదయనిధి కీర్తికి క్లోజ్ ఫ్రెండ్ కావడం, ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కీర్తి సురేశ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని కోలీవుడ్ గుసగుసలాడుతోంది.

Also Read: OG Shooting: సుజిత్ స్పీడ్.. మూడు నెలల్లోనే 50% OG షూటింగ్ కంప్లీట్

Exit mobile version