Site icon HashtagU Telugu

Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ గ్లామర్.. డోస్ పెంచిన మహానటి..!

Keerthy Suresh Glamour Show In Baby John Movie

Keerthy Suresh Glamour Show In Baby John Movie

Keerthy Suresh మహానటి కీర్తి సురేష్ సౌత్ నుంచి అలా బాలీవుడ్ వెళ్లిందో లేదో గ్లామర్ డోస్ పెంచేసింది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ కు వెళ్లింది. ఆ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డ్ కూడా అందుకుంది.

అయితే ఆ తర్వాత కీర్తి సురేష్ సినిమాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ దసరా తో మరో హిట్ అందుకున్న కీర్తి సురేష్ తమిళంలో కూడా రాణిస్తుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమా బేబీ జాన్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో ఎక్కడ తగ్గలేదని టాక్.

అంతకుముందు తెలుగు, తమిళ సినిమాల్లో స్కిన్ షో చేయడానికి సుముఖత చూపించని కీర్తి సురేష్ బాలీవుడ్ వెళ్లగానే గ్లామర్ షో మొదలు పెట్టింది. బేబీ జాన్ సినిమా నుంచి ప్రచార చిత్రాలు రిలీజ్ కాగా అందులో కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేసింది.

బాలీవుడ్ లో నెగ్గుకు రావాలంటే ఈమాత్రం గ్లామర్ షో తప్పదని ఫిక్స్ అయిన కీర్తి సురేష్ బేబీ జాన్ కోసం బాగానే కష్టపడిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Trisha : సౌత్ నెంబర్ 1 త్రిష.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా..!