Site icon HashtagU Telugu

Keerthy Suresh Gifts: కీర్తి యూ ఆర్ గ్రేట్.. దసరా చిత్ర యూనిట్ కు గోల్డ్ కాయిన్స్!

Keerthy Suresh

Keerthy Suresh

మహానటిగా టాలీవుడ్ (Tollywood) పై తనదైన ముద్ర వేసింది కీర్తి సురేష్. తాజాగా ఈ బ్యూటీ దసరా మూవీతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమయంలో తాజాగా నటి కీర్తి సురేష్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. మహానటి తర్వాత మళ్లీ అలాంటి నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర రావడం, షూటింగ్‌లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు దసరా టీం మొత్తానికి ఈమె బంగారు కాయిన్స్( Gold Coins ) బహుమతిగా అందజేసే తన బంగారు మనసును చాటుకున్నారు.  130 మంది దసరా టీమ్ కు ఒక్క గ్రామ్ గోల్డ్ కాయిన్ బహుమానంగా ఇచ్చారు. దీంతో ఆమె ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథ ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి విజయాలను అందుకుంటున్న కీర్తి సురేష్ తాజాగా నాని( Nani ) హీరోగా నటిస్తున్న దసరా( Dadsara ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకొని మార్చి 30వ తేదీ పాన్ ఇండియా( Paan India ) స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇక ఇందులో కీర్తి సురేష్ వెన్నెల(Vennela) అనే పాత్రలో నటించబోతున్నారు.ఈ సినిమాలో ఈమె డీ గ్లామర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.