Site icon HashtagU Telugu

Kalki 2898 AD : ‘కల్కి’ మూవీలో ప్రభాస్ బుజ్జికి వాయిస్ ఇచ్చేది.. ‘కీర్తి సురేష్’నా..!

Keerthy Suresh Gave Dubbing To Prabhas Bujji In Kalki 2898 Ad

Keerthy Suresh Gave Dubbing To Prabhas Bujji In Kalki 2898 Ad

Kalki 2898 AD : ప్రభాస్ చేస్తున్న కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడి’ కోసం రెబల్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ఈ మూవీ హిందూ పురాణ కథలు ఆధారంగా ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందుతుంది. హిందూ పురాణాల్లో చెప్పబడిన కొన్ని పాత్రలు.. ఈ మూవీలో సూపర్ హీరోలుగా కనిపించబోతున్నారు. అందుకనే ఈ మూవీ పై ప్రతి ఒక్కరిలో ఏంటో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.

ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానితో మరికొంతమంది స్టార్ నటీనటులు కూడా కనిపించబోతున్నారు. ఇక వీరితో పాటు ఈ మూవీలో మరో ముఖ్యమైన పాత్ర కూడా ఉంటుందట. ఆ పాత్రే ‘బుజ్జి’. ఈ సినిమాలో ప్రభాస్ తో ఒక మెషిన్ కూడా ఉంటుందట. దాని పేరే బుజ్జి అంట. ఇక ఆ మెషిన్ కారు అని సమాచారం. ఈ కారు మాట్లాడుతుంది అంట. ఇక ఈ మాటలని మహానటి ‘కీర్తి సురేష్’ వాయిస్ తో వినిపించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట.

కల్కిని డైరెక్ట్ చేస్తున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ గతంలో మహానటి చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయంతోనే కీర్తి సురేష్ వెంటనే ఓకే చెప్పి.. బుజ్జికి వాయిస్ చెప్పేందుకు గ్రీన్ సింగల్ ఇచ్చారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే.. ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఈ బుజ్జిని ఈరోజు సాయంత్రం గం.5లకు పరిచయం చేస్తానంటూ మన బుజ్జిగాడు నిన్న తెలియజేసాడు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని.. జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.