Keerthy Suresh Lungi Dance: కీర్తి సురేష్ లుంగీ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

మహానటి ఫేం కీర్తిసురేష్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలో చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో వీడియోలు,

Published By: HashtagU Telugu Desk
Keerthy Suresh

Keerthy Suresh

మహానటి ఫేం కీర్తిసురేష్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలో చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో వీడియోలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ పోస్టు చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. తాజాగా కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కొన్ని గంటల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్  పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నానితో కలిసిన నటిస్తున్న ‘దసరా’ చిత్రం ధూమ్ ధామ్ ధోస్థానా పాటకు డ్యాన్స్ చేసింది. “నా ధోస్త్ @akshitha.subramanianతో నా ధూమ్ ధామ్! మీ ధూమ్ ధామ్ ఎక్కడ ఉంది? #DhoomDhaamDhosthaan #Dasara.” అంటూ లుంగీ, చొక్కా ధరించిన వీడియోను పోస్ట్ చేసింది.

  Last Updated: 15 Oct 2022, 11:56 AM IST