Keerthy Suresh Dance video: మహానటి హాట్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ నటి, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ట్రెండింగ్‌లో ఉన్న మణికేకి డ్యాన్స్ చేసి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

  • Written By:
  • Updated On - September 30, 2022 / 01:09 PM IST

టాలీవుడ్ నటి, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ట్రెండింగ్‌లో ఉన్న మణికేకి డ్యాన్స్ చేసి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ‘థాంక్స్ గాడ్’ సినిమా లో పాపులర్ అయిన మణికే పాటకు డ్యాన్స్ వేసింది. వైట్ అండ్ బ్లాక్ కలర్ డ్రస్సులో పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు తమ డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా షేర్ చేస్తున్నారు. అందులో కీర్తి ముందుంటోంది.

కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్ తన డ్యాన్స్ వీడియో ను షేర్ చేసింది. అందులో బాలీవుడ్ పాటకు కీర్తి డ్యాన్స్ చేసింది. ఆమె తన పోస్ట్‌కి “హే గూగుల్…పార్టీ లైట్‌లను ఆన్ చేసి, మిడ్-వీక్ బ్లూస్‌ని ట్యూన్ చేయండి! మీ వీకెంట్స్ ప్లాన్స్ ? మీ #ManikeMove మాత్రమే #YouTubeShortsలో ఎలా ఉంది.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.