Site icon HashtagU Telugu

Keerthy Suresh: మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన కీర్తి సురేష్.. వెన్నెల డాన్స్ వీడియో వైరల్

Keerthy Suresh

Keerthy Suresh

నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేష్ కాంబినేషన్, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ ‘దసరా’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి కలెక్షన్లు మాత్రమే విమర్శలకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి, మహేశ్, ప్రభాస్ లాంటి స్టార్స్ ఈ మూవీకి ఫిదా అయ్యారు. నాని మాస్ యాక్టింగ్ ఎంతో ఫేమస్సో, వెన్నెలగా నటించిన కీర్తి సురేష్ సైతం మంచి మార్కులు కొట్టేసింది.

ఈ నేపథ్యంలో దసరా మేకర్స్ వెన్నెల పాత్రకు సంబంధించిన డాన్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తెలంగాణ అమ్మాయిగా కీర్తి సురేష్ ఆకట్టుకుంది. పచ్చని చీరకట్టులో బారాత్ తో డాన్సులు వేసి దుమ్మురేపింది. అచ్చం తెలంగాణ అమ్మాయిగా స్టెప్పులు వేసి ఈలలు వేయించింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ వీడియో వైరల్ అవుతోంది.

ఇక ఇటు యూట్యూబ్ లో సైతం ఈ డ్యాన్సింగ్ వీడియో అందరినీ అలరిస్తూ పెద్ద ఎత్తున వ్యూస్ తో కొనసాగుతోంది. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దిగ్విజయంగా దూసుకెళుతోంది. సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ పలు టాలీవుడ్ రికార్డులను అధిగమిస్తోంది.

Exit mobile version