Keerthi Suresh : చిత్రసీమలో మహానటి అడుగుపెట్టి 10 ఏళ్లు

తెలుగు ,తమిళ్ తో పాటు మలయాళంలో సినిమాలు చేస్తూ కీర్తి పేరు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసిన మహానటి మూవీ అమ్మడికి ఎంతో పేరు

Published By: HashtagU Telugu Desk
Keerthi 10yrs

Keerthi 10yrs

మహానటి మూవీ తో ఎంతో పేరు , ప్రతిష్టలు సంపాదించుకున్న కీర్తి సురేష్..చిత్రసీమలో అడుగుపెట్టి నేటికీ 10 ఏళ్లు గడిచాయి. నిర్మాత జి. సురేష్ కుమార్‌, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.14 నవంబర్ 2013లో వచ్చిన మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

ఈ మూవీ రిలీజ్ అయ్యి పదేళ్లు అవ్వడంతో #10YearsOfKeerthySuresh అనే ట్యాగ్ ని కీర్తి సురేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. తెలుగు ,తమిళ్ తో పాటు మలయాళంలో సినిమాలు చేస్తూ కీర్తి పేరు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసిన మహానటి మూవీ అమ్మడికి ఎంతో పేరు తీసుకురావడమే కాదు ఎన్ని అవార్డ్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సినీ జనాలంతా కీర్తి ప్రేవు జపం చేసారు. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టినప్పటికీ అవన్నీ ప్లాప్స్ అయ్యేసరికి మహానటి తో వచ్చిన గుర్తింపు అంత పోయింది.

We’re now on WhatsApp. Click to Join.

పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సామీ స్క్వేర్, పందెం కోడి 2 ,అన్నాతే… ఇలా ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అవ్వడంతో కీర్తి సురేష్ కెరీర్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అమ్మడు లావు తగ్గి స్లిమ్ అయ్యి కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించింది. అలాగే గ్లామర్ కి పెట్టుకున్న హద్దులను కూడా చెరిపేస్తూ సరికొత్త మేకోవర్ చూపించింది. సర్కారు వారి పాట సినిమాతో కీర్తి కొత్తగా కనిపించి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి దూరంగా వచ్చి హీరోల సినిమాలు చేయడానికి రెడీ అవ్వడంతో కీర్తి సురేష్ మళ్లీ బిజీ అయ్యింది.

కమర్షియల్ సినిమాల్లో కూడా తన పాత్రకి తగ్గ గుర్తింపు ఉన్న వాటినే చేస్తూ కెరీర్ ని మళ్లీ స్ట్రాంగ్ గా చేసుకుంటుంది. దసరా సినిమాలో వెన్నల పాత్ర అలాంటిదే. నాని మాస్ సినిమాకి కీర్తి సురేష్ ప్రాణం పోసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ హోంబలే బ్యానర్ లో ‘రఘు తాత’ సినిమా చేస్తోంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లోకి కూడా డెబ్యూ ఇస్తోంది.

Read Also : Pawan Kalyan Election Campaign : పవన్ అన్న ఎక్కడ..? తెలంగాణ అభ్యర్థుల ఆవేదన..!

  Last Updated: 14 Nov 2023, 12:20 PM IST