Fancy Number: ఫ్యాన్సీ నెంబర్ కోసం కేసిఆర్, ఎన్టీఆర్, చిరు అంత ఖర్చు పెట్టారా?

చాలామందికీ ఒక్కొక్క విషయం మీద నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వాస్తు ప్రకారం గా అదృష్టంగా భావిస్తే,

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 05:17 PM IST

చాలామందికీ ఒక్కొక్క విషయం మీద నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వాస్తు ప్రకారం గా అదృష్టంగా భావిస్తే, మరికొందరు వేసుకునే బట్టల ఆధారంగా మరికొందరికి న్యూమరాలజీ ఆధారంగా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇకపోతే చాలామంది ఫ్యాన్సీ నెంబర్ విషయంలో కూడా అదృస్టంగా భావిస్తూ ఉంటారు. కాగా ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నెంబర్ లపై ఉన్న క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీనితో ఫాన్సీ నెంబర్లకు బాగా డిమాండ్ పెరుగుతుంది.

సెలబ్రిటీతోపాటు రాజకీయ నాయకులు కూడా ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వీరితోపాటు ఎంతో మంది సిని,రాజకీయ వ్యాపారులు ఫ్యాన్సీ నెంబర్ ల కోసం లక్షలు ఖర్చు చేసి మరి ఆ లక్కీ నెంబర్లను సొంతం చేసుకుంటున్నారు. అయితే గతంలో కార్లకు మాత్రమే ఫ్యాన్సీ నెంబర్లు ఉండగా రాను రాను ఆ ట్రెండ్ టూ వీలర్లకు కూడా మారింది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ టూ వీలర్ కీ రూ.2 వేలు,కాగా ఫోర్ వీలర్ కి రూ 5 వేలు.

అలాగే రూ. 50 వేల నుంచి బిడ్డింగ్ ప్రారంభం అవుతోంది. 50 వేల తో మొదలైన ఆ బిడ్డింగ్ ఎన్ని లక్షల వరకు అయినా చేయవచ్చు. ఒక కేసీఆర్ తన కాన్వాయ్ వెహికల్స్ కి 6666 ఉండే విధంగా చూసుకున్నారు. చిరంజీవి తన రోల్స్ రాయ్స్ ఫాంటనమ్ కార్లకి 1111 నెంబర్ వచ్చేలా చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తన ప్రతి వాహనానికి కూడా 9999 వచ్చే విధంగా చేసుకున్నారు. నేపథ్యంలోనే తన వాహనం కోసం ఏకంగా 17 లక్షలు ఖర్చుపెట్టి మరి 9999 నెంబర్ నీ సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్