పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుంది అందాల భామ కావ్య థాపర్ (Kavya Thapar).అమ్మడు ఇంతకుముందు కూడా మూడు నాలుగు సినిమాలు చేసినా ఆశించిన క్రేజ్ సంపాదించలేదు. తెలుగులో ఈమాయ పేరేమిటో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కావ్య ఆ తర్వాత ఏక్ మిని కథ సినిమాలో కూడా నటించింది.
ఆ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించుకుని ఈమధ్యనే రవితేజతో ఈగల్, సందీప్ కిషన్ తో భైరవకోన సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. భైరవ కోన (Bhairavakona) హిట్ పడినా అమ్మడికి పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేదు. ఐతే పూరీ డబుల్ ఇస్మార్ట్ లో మాత్రం అమ్మడికి లక్కీ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో అమ్మడు తన గ్లామర్ డోస్ కూడా పెంచిందని తెలుస్తుంది.
డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) నుంచి లేటెస్ట్ గా వచ్చిన సాంగ్ చూస్తే కావ్య ని ఫుల్ గా వాడేసినట్టు అర్ధమవుతుంది. ఎలాగు తెలుగులో పాగా వేయాలని చూస్తున్న కావ్య గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసినట్టు అనిపిస్తుంది. కావ్య థాపర్ టాప్ గేర్ లో అందాలు గుమ్మరిస్తే కచ్చితంగా ఆడియన్స్ కు ఫీస్ట్ అన్నట్టే లెక్క.
డబుల్ ఇస్మార్ట్ భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా హిట్టు పడితే అమ్మడి ఫేట్ మారినట్టే లెక్క. ఈ సినిమాతో పాటుగా గోపీచంద్ (Gopichand) విశ్వంలో కూడా నటిస్తుంది అమ్మడు. సో వరుస అవకాశాలు అమ్మడికి మళ్లీ మళ్లీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా చేస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ లో గ్లామర్ సైడ్ కూడా కావ్య తన సత్తా చాటాలని చూస్తుంది. అదే జరిగితే టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ దొరికినట్టే అని చెప్పొచ్చు. అమ్మడు వచ్చిన ప్రతి సినిమాను కదనకుండా చేస్తూ చిన్నగా ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. కచ్చితంగా అమ్మడికి లక్ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అర్ధమవుతుంది.
Also Read : Superstar Mahesh : మురారి ఎడిటెడ్ వెర్షన్.. ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం..!